సప్ప భారతి భాగవతారిణి 

పరిచయం:

నా పేరు శ్రీమతి DR. సప్పా భారతి భాగవతారిణి. నేను ఏలూరు జిల్లా, ఏలూరు వాస్తవ్యురాలను. నేను హరికథ కళాకారిణిని, ఇప్పటికీ రాష్ట్ర రాష్ట్రేతర ప్రాంతాలలో 5 వేలకు పైగా హరికథ ప్రదర్శనలు ఇచ్చాను, నేను ప్రసార భారతి ,ఆల్ ఇండియా రేడియో విజయవాడ కేంద్రం నందు, 8/ 6 /2012 వ తేదీన ఏ గ్రేడు(A Grade) పొందడం జరిగింది. నేను చెప్పేటువంటి హరికథలు శ్రీ యదార్థ రామాయణం సంపూర్ణం, శ్రీ మహాభారతం 18 పర్వాలు,శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞాన సహిత సంపూర్ణ జీవిత చరిత్ర, భక్త అంబరీష, శ్రీ వెంకటాచల వైభవం, శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం, శివ లీలలు, గిరిజా కళ్యాణం ,శ్రీ షిరిడి సాయి జీవిత చరిత్ర మొదలైనవి.


తల్లిదండ్రులు:

నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు  శ్రీమతి బాలం నాగమణి భాగవతారిణి, శ్రీ బాలం సూర్యచంద్రరావు భాగవతులు (శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్) -హరికథ డిప్లమో ఆర్టిస్ట్ మరియు రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ ఉభయులు హరికథా కళాకారులు.


విద్యాభ్యాసం :

నేను ప్రాథమిక విద్య ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు తణుకు మేడబడినందు చదువుకున్నాను. ఎనిమిదవ తరగతి అత్తిలి గర్ల్స్ స్కూల్లో చదువుకున్నాను. ఆ తర్వాత నేను శ్రీ సర్వారాయ హరికథా పాఠశాల కపిలేశ్వరపురం తూర్పుగోదావరి జిల్లా, (వ్యవస్థాపకులు రాజమహేంద్రవరం మాజీ కేంద్ర మంత్రివర్యులు స్వర్గీయ బలుసు ప్రభాకర బుచ్చి కృష్ణ సత్యనారాయణ రావు జమీందారులు మరియు వారి ధర్మపత్ని శ్రీమతి రాజరాజేశ్వరమ్మ రాణి దంపతులు) నందు నా 12వ ఏట గురుకుల కళాశాలలో  చేరాను. శ్రీ సర్వారాయ హరికథ గురుకుల కళాశాల యందు హరికథలు 6 సంవత్సరములు అభ్యసించాను. తరువాత  ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం నందు బి ఎ(BA) పూర్తి చేయడం జరిగింది, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి నందు MA తెలుగు పూర్తి చేశాను.

అధ్యాపకులు :


సంగీతం
బ్రహ్మశ్రీ మహేంద్రవాడ కామేశ్వరరావు గారి వద్ద శిక్షణ పొందాను.

సంస్కృతం
శ్రీమాన్ అంగర సింగరాచార్యులు గారి వద్ద అభ్యాసం చేశాను.

తెలుగు
శ్రీ మేదిని సత్యనారాయణ గారు, కుమారి పప్పు సత్యవతి గారి వద్ద శిక్షణ పొందాను.

నాట్యం

శ్రీ కళా కృష్ణ గారు,కుమారి బాదంపూడి లక్ష్మీ గారు, బ్రహ్మశ్రీ పసుమర్తి శ్రీనివాస శర్మ గారి వద్ద అభ్యసించాను.

లయ

శ్రీ వక్కలగడ్డ నాగేశ్వరరావు గారి దగ్గర సాధన చేశాను.


హరికథలు

బ్రహ్మశ్రీ అక్క పెద్ది శ్రీరామ శర్మ భాగవతులు, బ్రహ్మశ్రీ తణుకు విశ్వనాథం భాగవతులు, శ్రీ గంటా గోపాలo భాగవతులు, శ్రీమతి ఉమా చౌదరి భాగవతారిణి, శ్రీ పులుగు వీరయ్య భాగవతులు గార్ల వద్ద శిక్షణ పొందాను.


సంస్కృత హరికథలు

శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారి వద్ద అభ్యసించాను.


నా వృతిిపరా టన :


నేను నా 12 ఏట నుండిహరికథలలో శిక్షణ పొందుతూ, హరికథా ప్రదర్శనలు ఇస్తూ పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాను,విజయనగరం- శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి ఆరాధన ఉత్సవాలలో హరికథ పోటీలలో నేను ప్రథమ బహుమతి అందుకున్నాను.,సద్గురువుల శిక్షణలో విద్యాభ్యాసం చేస్తూనే అనేక హరికథ ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది, మా తల్లితండ్రులు ఉభయులు హరికథా రంగంలో ఉండడం వల్ల నాకు చక్కటి మెలుకువలు చెబుతూ నన్ను తీర్చిదిద్దారు, నేను విద్య నభ్యసించిన మా శ్రీ సర్వారాయ హరికథ పాఠశాలలో జరిగిన హరికథ పోటీలలో నాకు ప్రథమ బహుమతిగా రజిత కంకణ ధారణ చేశారు, నేను పల్లెల్లో, పట్టణాల్లో, రాష్ట్ర రాష్ట్ర ఇతర ప్రాంతాలలో ఇప్పటివరకు ఐదువేలకు పైగా హరికథా గానాలు చేసి ఉన్నాను, తెలుగు భాషలోనే కాక సంస్కృత భాషలోను హరికథాగానాలు చేయడం నా ప్రత్యేకత, నేను హరికథ గానాలు చేసిన కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు : హర్యానా: ప్రపంచ తెలుగు మహాసభలు,ఆంధ్రా భవన్ న్యూఢిల్లీ -1998,ఒరిస్సా: తెలుగు సాహిత్య సమైక్య, భువనేశ్వర్, బరంపురం,పశ్చిమ బెంగాల్: శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన ఉత్సవ కమిటీ- ఖరగపూర్, కర్ణాటక : తెలుగు సాహిత్య సమైక్య- బెంగుళూరు, బళ్ళారి,తమిళనాడు: మ్యూజిక్ అకాడమీ మద్రాస్, టీటీడీ కల్యాణ మండపం, మేళ్ల టూరు, కుంభకోణం, మధ్యప్రదేశ్: కాళిదాస అకాడమీ- ఉజ్జయిని, ఉత్తర ప్రదేశ్: కాశి ముముక్షుభవనం- వారణాసి.



ఆంధ్ర ప్రదేశ్ :


తిరుమల నాదనీరాజనం శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ అలివేలు మంగాపురం, నాగలాపురం, కాణిపాకం, శ్రీశైలం ,శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం- బ్రహ్మంగారిమఠం, విజయవాడ- శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ దేవస్థానం, ద్వారకాతిరుమల- శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, భీమవరం- శ్రీ మావుళ్ళమ్మ తల్లి దేవస్థానం, అన్నవరం- శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం, రాజమహేంద్రవరం- గంగా హారతి, మరియు కోటి లింగాల రేవు, ఆనం కళా కేంద్రం, కాకినాడ- సూర్య కళా మందిరం, మరియు పంచారామ క్షేత్రాలు, విశాఖపట్నం- కళాభారతి, శ్రీకాకుళం- బాపూజీ కళామందిరం,  బెజ్జి పుట్టుగ - శ్రీ చక్రధర డోలోత్సవాలు, అనకాపల్లి- శ్రీనుకాంబిక అమ్మవారి దేవస్థానం, శ్రీ గౌరీ పంచాయతన దేవాలయ మండపం- శ్రావణమాసం నెల రోజులు, శ్రీ కామాక్షి దేవస్థా దేవస్థానం.


తెలంగాణ :


హైదరాబాద్ రవీంద్ర భారతి, త్యాగరాయ గాన సభ, శంకరమఠం, వేములవాడ- శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం, యాదగిరిగుట్ట- శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, సిరిసిల్ల,సూర్యాపేట- శ్రీ వేదాంతం భజన మందిరం, పాలవంచ, ఖమ్మం- టీటీడీ కల్యాణ మండపం.

 



ఆంధ్ర ప్రదేశ్ :


1

జాతీయ బంగారు నంది పురస్కారం- 2023. జి.సి.ఎస్. వల్లూరి ఫౌండేషన్, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, తేదీ: 17 సెప్టెంబర్, వేదిక: రవీంద్ర భారతి- హైదరాబాద్.

2

గౌరవ డాక్టరేట్- 2023 ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ, పాండిచ్చేరి.

3

భారత కళా రత్న అవార్డు- 2023, ఇంటర్నేషనల్ పీస్ కౌన్సిల్ ,పాండిచ్చేరి.

4

స్వర్ణ కంకణ ఘన సన్మానo -2010 పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి A.వాణి ప్రసాద్ గారి స్వహస్తాల మీదుగా జరిగింది .సంస్థ: శ్రీ గరికపాటి ఆర్ట్స్ థియేటర్స్, ఏలూరు.

5

రజిత కిరీట ధారణ-2019 , సంస్థ: శ్రీ గరికిపాటి ఆర్ట్స్ థియేటర్స్, ఏలూరు.

6

సువర్ణ హస్త కంకణ ఘన సన్మానం-2023 పార్లమెంటు సభ్యురాలు  శ్రీమతి డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి గారి దంపతుల చేతుల మీదుగా జరిగింది .సంస్థ: శ్రీ గౌరీ సేవా సంఘం, వేదిక: శ్రీ గౌరీ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం- అనకాపల్లి.

7

హరికథారత్న బిరుదు ప్రధానం- 2023 బి.వి.ఆర్. కళా కేంద్రం- తాడేపల్లిగూడెం.

8

హరికథా సరస్వతి బిరుదు ప్రధానం- 2023 ,శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాస శిష్య ప్రశిష్య సంఘం- విజయవాడ.

9

హరికథ చూడామణి బిరుదు ప్రధానం- శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాస సేవాసమితి- విజయనగరం.

10

ప్రథమ బహుమతి- 1998 శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారి ఆరాధనోత్సవములు- విజయనగరం.

11

శ్రీ స్వామి వివేకానంద ఎక్సలెన్సీ అవార్డు- 2018 యువ కళావాహిని, శారదా కళా సమితి సంయుక్త ఆధ్వర్యంలో, విజయవాడ.

12

లింకా బుక్ అవార్డు -2015, విశాఖపట్నం.

13

హరికథ గాన ప్రపూర్ణ బిరుదు ప్రధానం -2020 మార్చి ఒకటి, సంస్థ- అక్షరం ఆర్ట్స్, వేదిక- వై. ఎం. హెచ్.ఏ.హాలు, ఏలూరు

14

ఉజ్జయిని కాళిదాసు అకాడమీ, సుందరకాండ సంస్కృత హరికథాగానం చేసినందులకు గాను, శ్రీ సర్వారాయ హరికథ పాఠశాల వ్యవస్థాపకులు ,శ్రీ S.b.p.b.k. సత్యనారాయణ రావు గారి స్పహస్తాల మీదుగా నాలుగు కాసుల  బంగారు చైను తో సత్కారం జరిగింది.

15

హరికథాగాన ప్రవీణ బిరుదు ప్రధానo-శ్రీహరి యజ్ఞ సేవా సమితి ,ఇందుపల్లి.

16

శ్రీ సర్వరాయ హరికథ పాఠశాల, కపిలేశ్వరపురం, హరికథ పోటీల్లో ప్రథమ బహుమతికి గాను వ్యవస్థాపకుల చేతుల మీదుగా వెండి కంకణ ధారణ జరిగింది.

17

అనర్గళ కంఠామృతం- శ్రీ వీరబ్రహ్మం గారి కమిటీ, పిఠాపురం.

18

హరికథా భారతి బిరుదు ప్రధానం- శ్రీ కైవల్యానంద సరస్వతి స్వామి వారు, పూర్వాశ్రమంలో శ్రీ బుర్ర శివరామకృష్ణ శర్మ  భాగవతులు, విజయవాడ.

19

నాట్య మయూరి బిరుదు ప్రధానం- శ్రీ నరసింహ స్వామి జయంతోత్సవాలు, మేళ్ల టూరు.

20

స్వర్ణ కోకిల- 2022 ,శ్రీ గౌరీ పంచాయతన దేవాలయ మండపం, గవరపాలెం, అనకాపల్లి.

21

సకల కళాభారతి-2021, శ్రీ గౌరీ పరమేశ్వరి దేవస్థానం, అనకాపల్లి.

22

ఆత్మీయ సత్కార సన్మాన పత్రం- శ్రీ శ్రీ రామ రక్షా సేవా సంఘం ,మాళవ్య నగర్, గూడూరు, 14వ జయవార సత్సంగ భజన వార్షికోత్సవం సందర్భంగా బహుకరించారు.




🎵 YOUTUBE CHANNEL 🎵
📺 YouTube Link: https://www.youtube.com/c/sappabharathibhagavatarini

Comments

Popular posts from this blog

SAPPA BHARATHI BHAGAVATARINI - photos with celebrities & Details